Friday, September 20, 2024
HomeUncategorizedవైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ సమీక్ష

వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ సమీక్ష

Date:

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రులపైనా భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎయిమ్స్‌ను సందర్శించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని వెల్లడించారు. తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఉస్మానియా ఆస్పత్రిపై మంగళవారం హైకోర్టులో విచారణ ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందిస్తూ.. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుందామని స్పష్టం చేశారు. బోధనాసుపత్రుల్లో హౌస్‌ కీపింగ్‌ను ఫార్మా కంపెనీలకు ఇచ్చే అంశంపై పరిశీలించాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.