Monday, October 7, 2024
HomeUncategorizedవీధి కుక్కల బారి నుంచి మా ప్రాణాలు కాపాడండి

వీధి కుక్కల బారి నుంచి మా ప్రాణాలు కాపాడండి

Date:

హైదరాబాద్ నగరంలోని వీధి కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గం కొంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ…దొరికిన వాళ్లని వేటాడుతున్నాయి. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్,చైర్మన్ ల పై చర్యలు తీసుకోవాలని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు.

ఇంత మంది పిల్లలు ఒక్కసారిగా  పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో ప్రజలు బైటికి రానంతగా  కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి భారీన నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులకు తెలిపిన…కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని చిన్నారులు అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని,అలాగే సిఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.