Saturday, October 5, 2024
HomeUncategorizedవిమానంలో ఆగిన ప్రాణం..

విమానంలో ఆగిన ప్రాణం..

Date:

భారత సంతతి మహిళ ఫ్లైట్‌ టేకాఫ్‌ కాక ముందే సీటు ముందు కుప్పకూలి మరణించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ ప్రసిద్ధ చెఫ్‌ కావాలని కలలు కన్నది. 2020 మార్చిలో ఆమె ఆస్ట్రేలియా చేరుకుంది. కుకరీ చదివిన తర్వాత ఆస్ట్రేలియా పోస్ట్‌లో పనిచేస్తున్నది.

నాలుగేళ్ల తర్వాత భారత్‌లోని తల్లిదండ్రులను చూడాలని మన్‌ప్రీత్ కౌర్ భావించింది. ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత తొలిసారి భారత్‌కు ప్రయాణమైంది. జూన్‌ 20న మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ వెళ్లే క్వాంటాస్ విమానంలోకి ఎక్కింది. ఆ తర్వాత సీటు బెల్టు పెట్టుకునేందుకు ఆమె ఇబ్బంది పడింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే సీటు ముందు కుప్పకూలింది. టేకాఫ్‌కు ముందు ఆ విమానంలో చనిపోయింది. మరోవైపు క్షయవ్యాధి వల్ల మన్‌ప్రీత్ కౌర్ మరణించినట్లు ఆమె స్నేహితులు భావిస్తున్నారు. ఆమె అందరితో చాలా స్నేహంగా ఉంటుందని, కలిసి టూర్లకు వెళ్లినట్లు రూమ్‌మేట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో కౌర్ కుటుంబానికి సహాయం కోసం ‘గోఫండ్‌మి’ ద్వారా నిధుల సేకరణ చేపట్టారు.