Tuesday, October 8, 2024
HomeUncategorizedవిడాకులయ్యాక భార్య భవిష్యత్తు ఏంటి..?

విడాకులయ్యాక భార్య భవిష్యత్తు ఏంటి..?

Date:

భారతదేశంలోనూ చాలా జంటలు చిన్నపాటి గొడవల కారణంగానే విడిపోతున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. భారతదేశంలో విడాకులు అంత సులభంగా తీసుకోవచ్చా? విడాకులయ్యాక భార్య భవిష్యత్తు ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సాధారణంగా భారతదేశంలో విడాకులు తీసుకున్నాక మహిళలకు కొన్ని హక్కులుంటాయి. వీటి ద్వారా మాజీ భర్త ఆస్తిని మాజీ భార్య అడగవచ్చు, భరణం పొందవచ్చు. ఈ హక్కుల గురించి అవగాహన కలిగి ఉంటే మంచిది. అవేవో చూద్దాం.

*విడాకుల సమయంలో ఆస్తి హక్కులు*

భర్త, భార్య ఇద్దరూ కలిసి డబ్బు చెల్లించడం ద్వారా ప్రాపర్టీని కొనడం సాధారణం. అలాంటి సందర్భాల్లో విడాకుల తర్వాత భార్యకు తన 50% వాటాతో పాటు భర్త వాటాలో కూడా వాటాను క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది. విడాకులు ఖరారు అయ్యే వరకు భార్యకు ఆ ప్రాపర్టీలో నివసించే హక్కు కూడా ఉంది. ఒకవేళ ఆస్తిని భర్త ఒక్కడే కొనుగోలు చేస్తే, భార్యను క్లాస్ I చట్టబద్ధమైన వారసురాలుగా పరిగణిస్తారు కాబట్టి, ఆమెకు భరణం పొందే రైట్ ఉంది.

భర్త పేరు మీద రిజిస్టర్ అయిన ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయడానికి, ఆమె తన ఆర్థిక సహకారాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ను చూపించాలి. మహిళ తన సొంత డబ్బుతో చెల్లించిన అన్ని ఆస్తులు ఆమెకు చెందినవే అవుతాయి. ఆమె ఆ ఆస్తులను ఇతరులకు ఇవ్వడానికి, అమ్మడానికి లేదా తన దగ్గరే ఉంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

*భరణం హక్కులు*

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 125 కింద ఒక మహిళ తనకు, తన పిల్లలకు అధికారికంగా విడిపోయే సమయంలో మెయింటెనెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మెయింటెనెన్స్ లేదా భరణాన్ని తాత్కాలికంగా కోరవచ్చు లేదా పర్మనెంట్‌గా కూడా కోరవచ్చు.

తాత్కాలిక భరణం అంటే సపోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సమయం నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు భర్త చెల్లించే డబ్బు. శాశ్వత భరణం అంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లోని సెక్షన్ 25 ప్రకారం, న్యాయస్థానం ఒకేసారి చెల్లించమని సూచించవచ్చు లేదా నెలవారీ చెల్లింపు చేయమనవచ్చు.

*భరణం ఎలా నిర్ణయిస్తారు?*

భారతదేశంలో భరణం హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం వంటి అనేక చట్టాల ద్వారా నిర్ణయిస్తారు. భరణం మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు, న్యాయస్థానాలు దంపతుల జీవన ప్రమాణం, వారి వివాహ వ్యవధి, పిల్లల అవసరాలు (ఉంటే) వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. భర్త, భార్య మధ్య జీతం వ్యత్యాసం భారీగా ఉన్న సందర్భంలో, కూడా పనిచేసే మహిళలకు భరణం మంజూరు చేయవచ్చు.

విడాకుల సమయంలో ఆస్తులు రక్షించడానికి ముందస్తు ప్రణాళిక చాలా ముఖ్యం. ట్రస్ట్‌లను ఏర్పాటు చేయడం, వివాహానికి ముందున్న ఆస్తుల కచ్చితమైన రికార్డులను సంరక్షించడం, వేర్వేరు బ్యాంక్ అకౌంట్‌లు కలిగి ఉండటం ద్వారా వ్యక్తిగత సంపదను వైవాహిక ఆస్తి నుంచి వేరు చేయవచ్చు.