Sunday, November 17, 2024
HomeUncategorizedవర్షాకాలం హైకింగ్‌తో సాహసాలు చేద్దామా..!

వర్షాకాలం హైకింగ్‌తో సాహసాలు చేద్దామా..!

Date:

వర్షాకాలం చినుకు పడితే చాలు ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో అందంగా ఉంటుంది. ఈ సమయంలో బయట గాలికి తిరగడం, హైకింగ్ వంటి సాహసాలు చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఉండే పనుల నుంచి విశ్రాంతి కోసం ఇటువంటి సాహసాలు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు. ప్రకృతి నుండి వచ్చే ఆహ్లాదకరమైన గాలి, సువాసనతో మనసును హాయిగా ఉంచుకోవచ్చు.

ప్రకృతితో సహజమైన సంబంధం

ప్రకృతిలో ఉండే రకరకాల దృశ్యాలను చూడడానికి హైకింగ్ వంటివి అద్భుతమైన అనుభవాలు అని చెప్పవచ్చు. హిమాలయాలు, కొండప్రాంతాల్లో చేసే ఈ హైకింగ్ వల్ల సలహమైన ప్రకృతి అందాలు చూసి మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది. అంతేకాదు ఇలాంటి సాహసాలు శరీరానికి వ్యాయామం చేసిన ఫీలింగ్ ఏర్పరుస్తుంది. కొండ ప్రాంతాలపైకి ఎక్కడం వల్ల కలిగే అనుభూతితో మానసికంగా ఏర్పడే సంతోషంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ హైకింగ్ చేసే వారిలో చాలా రకాల మానసిక ఆరోగ్యాలు నయమైనట్లు నిపుణులు చెబుతున్నారు. మానసికంగా సంతోషంగా ఉండేవారు శారీరకంగా ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కునే అవకాశాలు కూడా తక్కువే అని అంటున్నారు. తరచూ ఆఫీసుల్లో పని ఒత్తిడికి లోనయ్యే వారు ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని పర్యటనలకు వెళ్లడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మెరుగైన గుండె ఆరోగ్యం

హైకింగ్ అనేది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. శరీర సామర్థ్యత, సమతుల్యతను పెంచడానికి తోడ్పడుతుంది. హృదయ స్పందన రేటును పెంచడమే కాకుండా, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. హైకింగ్ చేసే వారికి గుండెపోటు వంటి గుండె సంబంధింత సమస్యలలు రావడం చాలా తక్కువ అని అంటున్నారు.

మెరుగైన మానసిక స్థితి

హైకింగ్ మానసిక స్థితి, భావోద్వేగ శ్రేయస్సుపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. శారీరక శ్రమ, సాధారణంగా, ఎండార్ఫిన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. హైకింగ్ చేస్తున్న సమయంలో సూర్యరశ్మికి ఉండడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మానసిక స్థితి నియంత్రణకు కీలకం. శారీరకంగా అలసిపోయినా కూడా మానసికంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.