Sunday, September 22, 2024
HomeUncategorizedవయనాడ్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి

వయనాడ్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి

Date:

లోక్‌సభలో జీరో అవర్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్‌ విపత్తు అంశాన్ని ప్రస్తావించారు. వయనాడ్‌లో బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాలు ముందుకురావడం హర్షణీయమన్నారు. ఇటీవల తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వనయాడ్‌లో పర్యటించామమన్నారు. భయంకరమైన విధ్వంసాన్ని, జనాల బాధలను కళ్లారా చూశానన్నారు. కొండచరియలు విరిగిపడి రెండుకిలోమీటర్ల వరకు రాళ్ల కుప్పలు ఉన్నాయన్నారు.

విపత్తులో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని.. పెద్ద సంఖ్యలో జనం గల్లంతయ్యారన్నారు. సంఘటనా స్థలంలో సేవలందిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అందిస్తున్న సహాయాన్ని సహాయన్ని సైతం ప్రశంసించారు. కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారి తెగిపోయిందని.. దాంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో రెస్క్యూ బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. అయితే ఈ విపత్తులో చాలా సందర్భాలలో కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ప్రాణాలతో బయటపడడం చాలా బాధాకరమన్నారు. వాయనాడ్ ప్రజల సమస్యను లేవనెత్తినందుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.