Saturday, December 21, 2024
HomeUncategorizedలంచంగొండు అధికారులు తప్పించుకోలేరు

లంచంగొండు అధికారులు తప్పించుకోలేరు

Date:

రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) భూపాల్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆయనతో పాటు కలెక్టరేట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు జాయింట్‌ కలెక్టర్‌ రూ.8 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. డబ్బును సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా జేసీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ, సీనియర్‌ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. మరోవైపు నాగోల్‌లోని జేసీ భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇంటిలో రూ.16లక్షల నగదు, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ నుంచి తప్పించుకోలేరు.. సీవీ ఆనంద్‌

లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ అన్నారు. జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వీరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం సోమవారం రాత్రి ఎంతో చాకచక్యంగా పని చేసిందని కొనియాడారు.