Wednesday, September 25, 2024
HomeUncategorizedరోజు ఎక్కువసేపు కూర్చుంటే ఎన్నో సమస్యలు

రోజు ఎక్కువసేపు కూర్చుంటే ఎన్నో సమస్యలు

Date:

రోజులు మారుతున్న కొద్ది పిల్లలకు ఆటలు అంటే ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో చాలామంది ఆటలు ఆడటమే మానేశారు. చదువుకునేవారు, ఉద్యోగాలు చేసే వారు కూడా శారీరక శ్రమకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రోజంతా కూర్చొనే సమయం గడిపేస్తున్నారు. ఇలాంటి జీవనశైలితో శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సగానికి పైగా రోజూ ఆరు గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటారని అంచనా, ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనులు చేసే వారికి 5 ప్రాణాంతకమైన అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉంది. అవేవో తెలుసుకుందాం.

*శారీరక ఆరోగ్య ప్రమాదాలు

రోజులో ఎలాంటి శారీరక శ్రమ చేయకపోతే ఊబకాయం, టైప్-2 మధుమేహం, ఎర్లీ డెత్, గుండె జబ్బుల ప్రమాదాలు పెరుగుతాయి. మానవ శరీరం నిత్యం కదిలే లాగా నిర్మితమైంది. ఎముకలు, కండరాలు, కీళ్ళు అన్ని కలిసి పనిచేస్తూ నడవడం, పరిగెత్తడం, దూకడం, ఈత కొట్టడం వంటి వివిధ యాక్టివిటీస్‌కి అనువుగా ఉంటాయి. రోజంతా నిలబడి లేదా చురుకుగా ఉండటం వల్ల గుండె పనితీరు, డైజెషన్ హెల్త్, మొత్తం ఎనర్జీ లెవెల్స్ మెరుగుపడతాయి. శారీరక శ్రమ ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎంతో అవసరం.

*మానసిక ఆరోగ్య ప్రమాదాలు

రోజులో ఎటూ కదలకుండా కూర్చొని ఉండే వారికి మానసిక సమస్యలు వచ్చే ముప్పు కూడా ఎక్కువ. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నిరాశ, ఆందోళన పెరిగిపోతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాధారణంగా శారీరకంగా చురుకుగా ఉంటే ఎన్నో మానసిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది, మూడ్‌ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చక్కగా నిద్ర పడుతుంది. అదే పేలవమైన జీవన శైలిని అవలంబిస్తే ఆ ప్రయోజనాలన్నీ అందుకోలేం.

*ప్రమాదాలు

జస్ట్ స్టాండ్ అనే సంస్థ కూర్చోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదాన్ని వర్గీకరించింది.

తక్కువ ప్రమాదం: రోజుకు 4 గంటల కంటే తక్కువ కూర్చోవడం

ఓ మోస్తారు ప్రమాదం: రోజుకు 4-8 గంటలు కూర్చోవడం

అధిక ప్రమాదం: రోజుకు 8-11 గంటలు కూర్చోవడం

చాలా ఎక్కువ ప్రమాదం: రోజుకు 11 గంటల కంటే ఎక్కువ కూర్చోవడం

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పూర్ లైఫ్‌స్టైల్‌తో సంబంధం ఉన్న కొన్ని ఆరోగ్య ప్రమాదాలను తగ్గించుకోవడానికి వారానికి కనీసం 150 నిమిషాల మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనాలని సూచించింది.

*బరువు పెరగడం

రోజంతా కూర్చొని పని చేసే వారి శరీరంలో లిపోప్రొటీన్ లిపేస్ వంటి అణువుల విడుదల తగ్గుతుంది. సాధారణంగా ఈ అణువులు కొవ్వులు, చక్కెరలను ప్రాసెస్ చేస్తాయి. ఇవి తగ్గితే బరువు పెరిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. ఫలితంగా మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది.

*మధుమేహం

ఎక్కువ కూర్చునే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 112% ఎక్కువ. తక్కువ వ్యవధిలో బెడ్ రెస్ట్ తీసుకున్నా సరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగవచ్చు, ఇది మధుమేహానికి దారితీస్తుంది.

*రక్తపోటు

ఆఫీసులో పని చేసేవారు ఎక్కువగా కూర్చుంటుంటారు. అయితే దీనివల్ల హైబీపీ సమస్య తెలిత్తే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నారు, కొందరు ఉద్యోగుల హైపర్‌టెన్షన్ స్థాయిలు 2కి (140/90 mmHg కంటే ఎక్కువ) చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

*క్యాన్సర్

ఎక్కువసేపు కూర్చుంటే ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్దపేగు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదం చాలా పెరుగుతుంది.

*మానసిక సమస్యలు

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డిప్రెషన్, ఆందోళన వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఈరోజు ఎక్సర్‌సైజు చేయడం తక్కువసేపు కూర్చోవడం ముఖ్యం.