Friday, October 4, 2024
HomeUncategorizedరైలులో ఆనారోగ్య సమస్య దీనికి కాల్ చెయ్యండి

రైలులో ఆనారోగ్య సమస్య దీనికి కాల్ చెయ్యండి

Date:

రైలులో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలాసార్లు ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో వారికి ఏమి చేయాలో అర్థం కాదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే, మీకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే ఓ నెంబర్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు వెళ్తున్నప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు 139 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు.

రైల్వే అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది

ఒక ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించిన తరువాత, అతనికి సకాలంలో వైద్యం అందక మరణించిన సంఘటనలు రైలులో చాలాసార్లు కనిపించాయి. అయితే.. ప్రయాణ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ప్రయాణికులకు సహాయం చేసేందుకు రైల్వేశాఖ అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.

టీటీఈ సహాయం తీసుకోవచ్చు

139కి కాల్ చేయడమే కాకుండా.. మీరు టీటీఈకి.. మీరు లేదా ఎవరైనా ప్రయాణీకుల అనారోగ్య సమస్యల గురించి తెలియజేయవచ్చు. టీటీఈ దగ్గర ప్రయాణికులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ క్రమంలో.. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందిస్తాడు.

Xలో సహాయం కోసం అడగవచ్చు

X (Twitter)ని ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే.. మీరు భారతీయ రైల్వేలు, రైల్వేలు లేదా IRCTCని ట్యాగ్ చేసి, మీ PNR సమాచారాన్ని అందించడం వల్ల సహాయం అడగవచ్చు.

రైలులో మెడిసిన్ పొందవచ్చు

రైలులో ప్రయాణికుడు అనారోగ్యానికి గురైతే.. మీరు 139కి కాల్ చేసి మెడిసిన్ అడగవచ్చు. 58 కంటే ఎక్కువ రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా.. రైల్వే ప్రయాణికులు డాట్ ఇన్ యాప్‌కి వెళ్లి కూడా సహాయం అడగవచ్చు.