Saturday, September 21, 2024
HomeUncategorizedరామ్ దేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట

రామ్ దేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట

Date:

ప్రకటనల వ్యవహారంలో తప్పుదోవ పట్టించే పతంజలి ఆయుర్వేదకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ ప్రకటనలకు సంబంధించి యోగా గురువు, సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపై అలాంటి యాడ్స్‌ ఇవ్వబోమని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలిపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వారిపై ధిక్కరణ చర్యలు చేపట్టింది.