Saturday, October 5, 2024
HomeUncategorized'రాజదండం' భారత్‌కు గర్వకారణం

‘రాజదండం’ భారత్‌కు గర్వకారణం

Date:

పార్లమెంట్లో స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని ఏర్పాటు చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కే చౌధరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. ”సమాజ్‌వాదీ పార్టీ మన దేశ చరిత్ర, తమిళ సంస్కృతిని అగౌరవపరిచింది. ఇండియా కూటమికి భారతీయ చరిత్ర పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. ఆ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. తమిళ సంస్కృతిపై కూటమి నేతలకు ఎంత ద్వేషముందో ఈ వ్యాఖ్యల ద్వారా అవగతం అవుతోంది. ‘రాజదండం’ భారత్‌కు గర్వకారణం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు” అని యోగి ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఆరోపించారు.

ఎస్పీకి చెందిన ఎంపీ ఆర్‌కే చౌధరి రాచరికానికి ప్రతీక సెంగోల్‌ను పార్లమెంట్‌లో పెట్టడాన్ని ప్రశ్నించారు. ”రాజదండాన్ని సభ నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది” అని వ్యాఖ్యానించారు. దీనికి ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతిచ్చారు. దీనిపై తాజాగా స్పందించిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.