Monday, November 18, 2024
HomeUncategorizedయూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన AI యాప్

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన AI యాప్

Date:

నేడు ప్రపంచంలో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ అన్ని రంగాల్ని ప్రభావితం చేస్తూ అతి వేగంగా దూసుకుపోతుంది. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షలోని ప్రశ్నల్ని.. కేవలం 7 నిమిషాల్లో ఏఐ యాప్‌ పరిష్కరించింది. ఐఐటీ పరిశోధకులు ఏఐ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ‘పధ్‌ ఏఐ’ యాప్‌.. ప్రిలిమ్స్‌ పరీక్షలో 200కు గాను 170 మార్కుల స్కోర్‌ను అందుకుంది.

ఆదివారం యూపీఎస్సీ పరీక్ష ముగిసిన తర్వాత, ఢిల్లీలోని లలిత్‌ హోటల్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి పలువురు విద్యావేత్తలు, యూపీఎస్సీ వర్గాలు, జర్నలిస్టులు హాజరయ్యారు. అందరి సమక్షంలో ప్రిలిమ్స్‌ పరీక్షలోని ప్రశ్నల్ని ఎదుర్కొన్న ‘పధ్‌ ఏఐ’ అలవోకగా సమాధానాలు ఇచ్చింది. 170 స్కోర్‌ చేసింది. గత 10 ఏండ్లలో ప్రిలిమ్స్‌ పరీక్షలో ఇది అత్యధిక స్కోర్‌గా పధ్‌ ఏఐ సీఈవో కార్తికేయ మంగళం తెలిపారు.