Monday, September 23, 2024
HomeUncategorizedమేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

Date:

ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన అదివాసీ గిరిజన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మేడారం జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. మేడారం మహా ఘట్టం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు.

ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. కుటుంబసమేతంగా మేడారం జాతరకు వచ్చే భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని సీతక్క సూచించారు. కాగా, ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు సమ్మక్క సారలక్కల మేడారం మహా జాతర జరగనుంది. వనదేవతల దర్శనం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు