Saturday, September 21, 2024
HomeUncategorizedమహిళల ఉచిత ప్రయాణానికి కొత్త బస్సులు

మహిళల ఉచిత ప్రయాణానికి కొత్త బస్సులు

Date:

కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకమైనది. శక్తి పేరుతో ఈ పథకాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన ఎక్స్‌ప్రెస్ బస్సులన్నింట్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

మహిళల ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చడానికి కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఇదివరకు 2,000 వరకు కొత్త సిటీ బస్సులను బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడున్న స్టాఫ్‌పై భారాన్ని తగ్గించడానికి అదనంగా డ్రైవర్లు, కండక్టర్ల ఖాళీలను సైతం భర్తీ చేసింది. ఇప్పుడు తాజాగా మరో వంద ఎక్స్‌ప్రెస్ బస్సులను కొనుగోలు చేసింది కేఎస్ఆర్టీసీ. నాన్- ఏసీ బస్సులు ఇవి. మహిళలకు మరింత మెరుగైన ప్రయాణ వసతిని కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య సర్కార్. వీటికి అశ్వమేధ క్లాసిక్‌ అని పేరు పెట్టింది. రద్దీ రూట్లల్లో పాయింట్ టు పాయింట్ సర్వీస్‌గా వాటిని నడిపించనుంది.

సోమవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్సు టెక్నికల్ డీటెయిల్స్‌ను అడిగి తెలుసుకున్నారు. కొంతదూరం అందులో ప్రయాణించారు.