Saturday, September 21, 2024
HomeUncategorizedమహారాష్ట్ర మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూపాయి

మహారాష్ట్ర మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూపాయి

Date:

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులకు కన్నీరే మిగులుతోంది. ఉల్లి కనిష్ట ధరకు పడిపోవడంతో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి కిలోకు రూపాయి పలకడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. కనీసం పెట్టబడి పైసలు కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

మహారాష్ట్రలోని సోలాపూర్, రాహురి మార్కెట్లలో ఫిబ్రవరి 10న కిలో ఉల్లి ధర రూ. 1కి పడిపోయింది. మన్మాడ్‌లో కిలో ఉల్లి ధర రూ.2గా ఉంది. దీంతో ఉల్లి రైతులు కన్నెర్ర జేస్తున్నారు. ఉల్లి సాగు చేపట్టబోమని స్పష్టం చేస్తున్నారు. ఉల్లి రైతులు బాగుపడాలంటే వెంటనే ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు. ఎగుమతిపై నిషేధం కారణంగానే కిలో ఉల్లి రూ.1 నుంచి రూ.8 పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు భారీగా పడిపోయినా.. కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల నిషేధ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం దారుణమన్నారు. ఫిబ్రవరి 10న సోలాపూర్ మార్కెట్‌కు 30వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చన్నారు. కనీస ధర క్వింటాల్‌కు రూ.100గా ఉంది అంటే కిలోక రూపాయి పలికినట్లు. లక్ష క్వింటాళ్లకు పైగా వచ్చిన ధర అదే స్థాయిలో ఉండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు వినియోగదారులను ఏడిపించిన ఉల్లి.. ఇప్పుడు పండించిన రైతులను ఏడిపిస్తోంది.