Friday, October 4, 2024
HomeUncategorizedమళ్లీ తొలిస్థానానికి చెరుకున్న ఎలాన్‌ మస్క్‌

మళ్లీ తొలిస్థానానికి చెరుకున్న ఎలాన్‌ మస్క్‌

Date:

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మళ్లీ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్‌ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. 205 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెజోస్‌, 199 బిలియన్‌ డాలర్లతో బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంతో మస్క్‌ తిరిగి మొదటి స్థానంలో నిలిచారు.

ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో మస్క్‌ వేతన ప్యాకేజీకి ఆమోదముద్ర పడింది. 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీంతో టెస్లా షేర్లు రాణించాయి. పే ప్యాకేజీపై పోరాటం, ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికలు, టెక్-స్టాక్ ర్యాలీ కారణంగా మస్క్‌ సంపద బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ xAIకి 24 బిలియన్ల డాలర్లు కంటే ఎక్కువ నిధులు వచ్చి చేరడం కూడా ఆయనకు కలిసొచ్చింది. బ్లూమ్‌బర్గ్ వెల్త్‌ ఇండెక్స్‌ ప్రకారం మస్క్‌కు కంపెనీలో 65శాతం వాటా ఉంది.