Sunday, September 29, 2024
HomeUncategorizedమల్కాజిగిరి లోక్ సభ కో-ఆర్డినేషన్ కమిటీలో కానుగంటి రాజుకు అవకాశం

మల్కాజిగిరి లోక్ సభ కో-ఆర్డినేషన్ కమిటీలో కానుగంటి రాజుకు అవకాశం

Date:

దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి లోక్ సభ కాంగ్రెస్ కో-ఆర్డినేషన్ కమిటీ ఎంపిక చేసారు. ఈ కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. కానుగంటి రాజుకు అవకాశం కల్పించారు. కానుగంటి రాజు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయని, కార్యకర్త స్థాయి నుండి అధిష్టానం వరకు పార్టీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. దేశంలో ఇటీవల కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడంతో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థుల విజయంపై పార్టీలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పార్టీ దూసుకుపోతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల వంటి అభ్యర్థులను పోటీలో నిలబెట్టడమే కాకుండా, వారి గెలుపు కోసం పార్టీ ఉన్నతి కోసం నీతి, నిజాయితీలతో పని చేసే సైనికులు వంటి నాయకులను కమిటీలుగా మోహరించడం కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో భాగం అన్నారు. ఇందుకోసం పార్టీ గెలుపునే ఆశయంగా భావించే మెరికల్లాంటి పార్టీ నాయకులతో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో కో-ఆర్డినేషన్ కమిటీలను నియమించారు. మల్కాజిగిరి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి పట్నం సునీత రెడ్డి విజయ సాధనలో ఈ కమిటీ పార్టీ అధినాయకత్వం ఆదేశాలను అనుసరించి పనిచేస్తుందని కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. కానుగంటి రాజు మీడియాకు వివరించారు. ఆరుగురు సభ్యులు గల ఈ కమిటీలో కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల గద్దర్, ఇంకా నలుగురు సభ్యులతో కూడిన కమిటీ పార్టీ అభ్యర్థి పట్నం సునీత రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ పైనే పోటీ చేసి, సొంత సామాజిక వర్గం పెరిక కులం నాయకుడిగా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పార్టీ తరఫున కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల డాక్టర్ కానుగంటి రాజు అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలో కోఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా అవకాశం కల్పించిన కంటోన్మెంట్ నియోజక వర్గం ఇంఛార్జి వెన్నెల గద్దర్, డిసిసి అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలకు డా. కానుగంటి రాజు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గం ఇన్ ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేసి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ లను భారీ మెజారిటీ తో గెలిపిస్తామని, పెద్దల ఆశీర్వాదంతో అభ్యర్థుల గెలుపుతో పాటు, భారీ మెజారిటీ కోసం కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.