Sunday, September 22, 2024
HomeUncategorizedమద్యం మానేస్తే శరీరంలో మంచి మార్పులు

మద్యం మానేస్తే శరీరంలో మంచి మార్పులు

Date:

మద్యం మితంగా తీసుకున్న, అమితంగా తీసుకున్న ఆరోగ్యానికి హానికరమే. మద్యంతో ఆరోగ్యం, కుటుంబం ఇబ్బందులు పాలవుతుందని తెలిసిన చాలా మంది ఆ అలవాటు నుంచి బయటపడేందుకు ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాల ద్వారా మద్యం అలవాటును దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికి తోడు శరీరం ఇచ్చే సూచనలను అర్థం చేసుకొని ఆల్కహాల్‌ మానేయాలి. లేకపోతే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. మందు మానేయాలనే నిర్ణయం, ఒక వ్యక్తి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఆరోగ్యపరంగానే కాదు మానసికంగా, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. మద్యం మానేసిన వెంటనే శరీరంలో మార్పులు మొదలవుతాయి. దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు అందుతాయి. మద్యపానానికి దూరంగా ఉంటే శరీరంలో వచ్చే మార్పులు చాలా ఉన్నాయి.

చర్మం మెరుగ్గా కనిపిస్తోంది

ఎక్కువగా మందు తాగేవారు, సడన్‌గా ఆల్కహాల్ మానేసిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. తేలికపాటి ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, వణుకు, మూర్ఛ, మతిమరుపు వంటివి ఎదురుకావచ్చు. ఈ లక్షణాల తీవ్రత, తీసుకునే ఆల్కహాల్ శాతాన్ని బట్టి ఉంటుంది. కొన్ని రోజుల నుంచి చాలా వారాల వరకు ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్‌ చేస్తుంది. మద్యపానం మానేసినప్పుడు శరీరం మళ్లీ హైడ్రేట్ అవుతుంది. ఇది చర్మాన్ని మెరుగ్గా కనిపించేలా చేస్తుంది, మరింత శక్తిని ఇస్తుంది. దీంతో శరీరక విధులు, అవయవాల పనితీరు మెరుగవుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

ఆల్కహాల్ తాగినప్పుడు ఎక్కువగా నిద్రపోయినా సరే, అది నిద్ర నాణ్యతను దిగజార్చుతుంది. మద్యపానం మానేసినప్పుడు నిద్ర మెరుగవుతుంది. దీంతో మరింత విశ్రాంతి తీసుకోవచ్చు. ఆల్కహాల్ శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెంచుతుంది. అయితే మందు తాగడం మానేసినప్పుడు, శరీరం ఈ సమస్యను పరిష్కరించగలదు. ఆల్కహాల్‌ మానేస్తే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఆల్కహాల్‌లో చాలా కేలరీలు ఉంటాయి, కాబట్టి ఈ అలవాటు మానేస్తే బరువు తగ్గవచ్చు. ఆల్కహాల్‌ తీసుకోనప్పుడు శరీరం ఫ్యాట్‌ను మెరుగ్గా బర్న్‌ చేస్తుంది. ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కానీ ఈ అలవాటు మానేస్తే, కాలేయం నయం కావడం ప్రారంభమవుతుంది. పూర్తిగా మెరుగుపడకపోవచ్చు, కానీ మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆల్కహాల్ మానేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు, గుండె సమస్యలు, స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అతిగా తాగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కానీ మద్యపానం మానేస్తే, ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాలక్రమేణా ఆత్రుత, విచారం తగ్గుతాయి. – ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. మద్యపానం మానేసినప్పుడు శరీరం బలంగా తయారవుతుంది, అనారోగ్యంతో మెరుగ్గా పోరాడుతుంది.

మానసికంగా మెరుగైన అనుభూతి

సాధారణంగా ఆల్కహాల్ తాగినప్పుడు మానసిక స్థితి గందరగోళానికి గురవుతుంది. కానీ మద్యపానం మానేస్తే, మూడ్ మెరుగుపడవచ్చు. మద్యం మానేయడం వల్ల మానసికంగా మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది, ఇది రిలేషన్స్‌ వృద్ధి చెందడానికి సహాయం చేస్తుంది. చాలా మంది మద్యం మానేయడం కష్టంగా భావిస్తారు. అయితే మందు తాగడం మానేయాలని నిర్ణయం తీసుకుంటే, ఇందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఆల్కహాలిక్ ఎనానిమస్ వంటి గ్రూపుల నుంచి సపోర్ట్‌ తీసుకోవడం మంచిది. కొత్త క్రియేటివ్ హాబీస్ అలవాటు చేసుకోవడం మంచిది. దీంతో డ్రింక్స్‌పైకి దృష్టి మళ్లకుండా కాపాడుకోవచ్చు.