Friday, September 20, 2024
HomeUncategorizedమ‌ద్యం తాగి నిమ‌జ్జ‌నంలో పాల్గొంటే చ‌ర్య‌లు తీసుకోవాలి

మ‌ద్యం తాగి నిమ‌జ్జ‌నంలో పాల్గొంటే చ‌ర్య‌లు తీసుకోవాలి

Date:

హైదరాబాద్ మ‌హానగ‌రంలో వినాయ‌క చ‌వితి పండుగ‌ను చాలా ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ప్ర‌తి గ‌ల్లీలో రెండు, మూడు గ‌ణ‌నాధుల‌ను ప్ర‌తిష్టించి పూజ‌లు చేస్తారు. అయితే నిమజ్జనం సందర్భంగా కొంత మంది మద్యం తాగి వేడుకల్లో పాల్గొంటారు. కొందరు దేవుడిపై భక్తితో కాకుండా ఎంజాయ్ కోసం వినాయక నిమజ్జనంలో పాల్గొంటారు. ఇలాంటి వారిపైనే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది మద్యం సేవించి వినాయక నిమజ్జనానికి వెళ్తున్నారని.. వారి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. సీపీకి ఓ లేఖ కూడా రాశారు. గత సంవత్సరం నిమజ్జనం సందర్భంగా కొంత మంది మద్యం తాగి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారని లేఖలో పేర్కొన్నారు. కొంత మంది బుద్దిలేని వాళ్లు గణేష్ విగ్రహం వద్ద బీర్, మద్యం తాగుతూ తినిపించారని వివరించారు.

మద్యం తాగి గొడవలు కూడా పెట్టుకున్నారని.. ఇలా జరగకుండా చూడాలని సూచించారు. గతంలో కొంత మంది ట్రక్‌లపై కూర్చోని నిమజ్జనం చూడటానికి వచ్చిన మహిళపై వాటర్ ప్యాకెట్లు విసిరేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. గణేష్ నిమజ్జనం హిందువులకు పెద్ద పండుగ అని గుర్తు చేశారు. మద్యం సేవించి గణపతి ఊరేగింపులో పాల్గొనడం తప్పని చెప్పారు. ఎవరైనా మద్యం సేవించి, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.