Wednesday, October 2, 2024
HomeUncategorizedమంచి ఆరోగ్యానికి ఔషధం.. వేరుశెనగలు

మంచి ఆరోగ్యానికి ఔషధం.. వేరుశెనగలు

Date:

వేరుశనగ గింజల్లో సహజ సిద్ధంగా అనేక పోషకాలు లభిస్తాయి. పనిలేకుండా ఖాళీగా ఉన్న సమయంలో టైం పాస్ కోసం చాలా మంది రుచికరమైన వేరుశనగ గింజలను తినడానికి ఇష్టపడతారు. వేరుశనగ గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ,B విటమిన్లు , విటమిన్ E వంటి ఖనిజాలు ఉంటాయి. రోజూ వేరుశెనగ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు కలగటమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వేరుశెనగలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉడికించిన వేరుశెనగలను తినడం వల్ల జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వేరుశెనగల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక రకాలుగా పనిచేస్తాయి. 

జ్ఞాపక శక్తి : వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఎందుకంటే వేరుశెనగల్లో ఉండే విటమిన్ ఈ కారణంగా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.

ఊబకాయం : ఉడకబెట్టిన వేరుశెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తాయి. దీంతో కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉండి బరువు తగ్గించేందుకు చాలా బాగా తోడ్పడుతాయి.

కొలెస్ట్రాల్‌ను నియంత్రణ : వేరుశెనగల్లో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడతాయి.

కంటి చూపును మెరుగు : కళ్ళు బలహీనంగా మారకుండా ఉండాలంటే వేరుశెనగ గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది. ఇందులో ఉండే జింక్ శరీరం విటమిన్ ఎను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రేచీకటి రాకుండా చేయటంలో సహాయపడుతుంది.

దృఢంగా ఎముకలు: ఎముకలను బలోపేతం చేయాలనుకుంటే, వేరుశెనగ గింజలను తీసుకోవాలి. వీటిలో మాంగనీస్ మరియు ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వల్ల, వేరుశెనగ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ప్రోటీన్ కు మంచి మూలం : శాఖాహారులు ప్రోటీన్ పొందాలనుకుంటే వేరుశనగ గింజలు మంచి ఎంపిక. ఒక పిడికెడు వేరుశెనగలో 7.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి మేలు : వేరుశెనగలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేరుశెనగ తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడి తగ్గిస్తోంది : ఇటీవలి కాలంలో మానసిక సమస్యలకు గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వేరుశెనగ తినడం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది డిప్రెషన్‌ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.