Tuesday, November 5, 2024
HomeUncategorizedభార్యతో భర్త అసహజ శృంగారం రేప్ కాదు

భార్యతో భర్త అసహజ శృంగారం రేప్ కాదు

Date:

తన భర్త అసహజ శృంగారం చేస్తున్నట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసిన కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టిపారేసింది. అయితే చట్టం ప్రకారం అది నేరం కాదు అని, ఎందుకంటే ఆమె అతడిని పెళ్లి చేసుకున్నట్లు ఆ ఆదేశాల్లో కోర్టు పేర్కొన్నది. పెళ్లాడిన భార్యతో అసహజ శృంగారం చేయడం ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం నేరం కాదు అని, దీనిపై మరింత సంప్రదింపులు అవసరం లేదని, భార్య నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. జస్టిస్ జీఎస్ అహ్లువాలియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. బుధవారం వెలుబడిన ఆ ఆదేశాలకు చెందిన వివరాలను గురువారం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వైవాహిక బంధంలో రేప్‌కు గుర్తింపు లేదని, జబల్‌పుర్ పోలీసు స్టేషన్‌లో నమోదు అయిన కేసును రద్దు చేస్తున్నామని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.