Wednesday, October 2, 2024
HomeUncategorizedభారత్ మసాల బ్రాండ్‌లపై మరో దేశం నిషేధం

భారత్ మసాల బ్రాండ్‌లపై మరో దేశం నిషేధం

Date:

భారత్‌ వంటకాలల్లో మసాల పౌడర్లు అధికంగా వాడుతుంటారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ మసాల బ్రాండ్‌లపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో దేశం చేరింది. ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పధార్థాలున్నాయనే కారణంతో హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్ దేశాలు ఇప్పటికే వీటిపై నిషేధం విధించాయి. ఇప్పడు నేపాల్ కూడా ఈ మసాల బ్రాండ్‌లపై నిషేధం విధించింది.

ఈ మసాలా దినుసుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు వార్తలు రావడంతో నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మసాల బ్రాండ్‌ల దిగుమతులతో పాటు విక్రయాలు కూడా ఆపివేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ తాము ఈ రెండు కంపెనీల మసాలాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఈ మసాల దినుసులపై తుది నివేదిక వచ్చే వరకు వీటిని ఇక్కడ నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ దేశంతోపాటు సింగపూర్ కూడా ఎవరెస్ట్ మిక్స్ ను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఇంకా న్యూజిలాండ్, యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆ రెండు మసాల బ్రాండ్ లకు సంబంధించిన సమస్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. బ్రిటన్ ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై మే 16వ తేదీన నిషేదం విధించింది. ఈ మసాల బ్రాండ్‌లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో వీటిపి దర్యాప్తు జరుగుతోందని, పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు ఈ దినుసులపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.