Sunday, September 22, 2024
HomeUncategorizedభారత్‌- బంగ్లా సరిహద్దులో హైఅలర్ట్..

భారత్‌- బంగ్లా సరిహద్దులో హైఅలర్ట్..

Date:

బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశంపై తీవ్ర ఉద్రికత్తలకు కారణమైంది. దేశాన్ని అగ్ని గుండంలా మార్చింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగు దేశంలో ఉద్రికత్తల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత్‌- బంగ్లా సరిహద్దులో బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ హైఅలర్ట్‌ ప్రకటించింది.

4, 096 కిలోమీటర్ల మేర ఉన్న భారత్‌- బంగ్లా సరిహద్దులో అదనపు బలగాలను వెంటనే మోహరించాలని ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్‌ అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక, రాజకీయ పరిణామాల దృష్ట్యా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్‌ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయి. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఇప్పటికే బీఎస్ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ ఛౌదరి కోల్‌కతా చేరుకున్నట్లు తెలుస్తోంది.