Sunday, October 6, 2024
HomeUncategorizedబోలేబాబాకు జైలు తప్పేలా లేదు

బోలేబాబాకు జైలు తప్పేలా లేదు

Date:

ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలేబాబాపై తొలికేసు నమోదైంది. పట్నా కోర్టులో ఈ కేసు ఫైల్ అయిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జులై 2న హాథ్రస్‌లో నిర్వహించిన సత్సంగ్‌కు 80వేల మందికి ఏర్పాట్లు చేయగా.. రెండున్నర లక్షలమంది హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ‘సేవాదర్‌ ఆర్మీ’గా పిలిచే బృందం ఈ కార్యక్రమాలను నిర్వహించింది. భక్తులు పోటెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బాబా వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాతే ఘటన జరిగిందని ఆయన తరఫు లాయర్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని, భక్తులను భద్రతా సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆ రోజు ముఖ్యసేవాదర్‌గా ఉన్న దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ నిందితుడిగా ఉన్నాడు. అతడిని శుక్రవారం రాత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.