Saturday, September 28, 2024
HomeUncategorizedబెంగళూరు నీటి కొరతతో మూతపడ్డ చిన్న హోటల్స్

బెంగళూరు నీటి కొరతతో మూతపడ్డ చిన్న హోటల్స్

Date:

బెంగళూరులో నీటి సమస్య మరింత తీవ్రమైంది. గుక్కెడు నీళ్ల కోసం బెంగళూరు వాసులు నానా తిప్పలు పడుతున్నారు. నీటి వినియోగంపై ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టినా, బెంగళూరు వాసులు జాగ్రత్తగా నీటిని వినియోగించుకోవాలని భావించినా, నీళ్లు మాత్రం దొరకని పరిస్థితి ఇక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. నీటి కొరతతో చిన్న చిన్న హోటల్స్ మూతపడ్డాయి. పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్లినా నీళ్ల విషయంలో జాగ్రత్తపడటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. హోటల్స్ లో పెట్టిన మెనూలో కూడా సాంబార్, రసం వంటి నీటితో తయారుచేసే ఆహారాలు దొరకడం లేదు. హోటల్స్ లో టాయిలెట్ కి వెళ్ళాలి అన్నా టోకెన్ సిస్టమ్ పెడుతుండటం గమనార్హం. బెంగళూరులో ఉన్న నీటి సమస్య తీవ్రతకు తాజాగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి.

ఇప్పటికే బెంగళూరులో జీవిస్తున్న ఇతర ప్రాంతాల వారు నీటి ఎద్దడిని తట్టుకోలేక తమ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. నీటి ఎద్దడితో చాలా సంస్థలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసిందిగా సూచిస్తున్నారు. ఇక ఇళ్ళలో కూడా నీటికి ఇబ్బంది పడుతున్నారు జనం. ఇక చేతులు కడుక్కోవాలి అంటే కూడా నీళ్లకు బదులు టిష్యూ పేపర్లతో తుడుచుకుంటూ మమ అనిపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో పది రోజులకు ఒకసారి నీటి సరఫరాను బెంగళూరు మహానగర పాలక సంస్థ చేపడుతుంది. నీటి వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని కేవలం బ్రతకడానికి, గొంతు తడుపు కోవడానికి మాత్రమే నీటిని ఉపయోగించాలని పదేపదే అ