Saturday, October 5, 2024
HomeUncategorizedబీహార్‌లో వరుసగా కూలుతున్న బ్రిడ్జిలు

బీహార్‌లో వరుసగా కూలుతున్న బ్రిడ్జిలు

Date:

బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం కిషన్‌బాగ్‌ జిల్లాలో, జూన్‌ 23న తూర్పు చంపారన్‌ జిల్లాలో, 22న సిశాన్‌లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను బీహార్‌ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్‌ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. రాష్ట్రంలో గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన కావడం గమనార్హం. దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్‌ వర్క్స్‌లో నాణ్యతా లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వరుస ప్రమాదాలతో అధికారులు కూడా ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదవశాత్తు కూలిపోయాయా..? లేక ఎవరైనా కావాలనే కూల్చి వేస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.