Sunday, December 22, 2024
HomeUncategorizedబాలరాముడికి 'శ్రీరామ రాగ సేవ'

బాలరాముడికి ‘శ్రీరామ రాగ సేవ’

Date:

అయోధ్య రామమందిరంలో కొలువైన బాల రాముడి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈక్రమంలోనే ఆలయంలో శ్రీరాముడికి అంకితమిస్తూ 45 రోజుల పాటు భక్తి సంగీత ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు వెల్లడించారు. 100 మందికి పైగా కళాకారులు ఈ వేడుకలో పాల్గొని ‘శ్రీరామ రాగ సేవ’ అందించనున్నట్లు తెలిపారు. నేటినుంచి ప్రారంభం కానున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు కొనసాగుతుందన్నారు.

శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు.. రాముడి పాదాల చెంత ‘రాగ సేవ’ అందిస్తారు” అని ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. హేమామాలిని, అనూప్ జలోటా, అనురాధ పౌడ్వాల్, మాలిని అవస్థీ, సోనాల్ మాన్‌సింగ్, సురేశ్‌ వాడ్కర్, పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. బాలరాముడి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్న విషయం తెలిసిందే.