Saturday, September 21, 2024
HomeUncategorizedబలపరీక్షలో నెగ్గిన సీఎం చంపయీ సోరెన్

బలపరీక్షలో నెగ్గిన సీఎం చంపయీ సోరెన్

Date:

ఝార్ఖండ్‌ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకు గానూ 47 మంది ఆయనకు మద్దతిచ్చారు. ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంపయీ సోరెన్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ బిజెపిపై విమర్శలు గుప్పించారు.

‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించింది. హేమంత్‌ సోరెన్‌పై తప్పుడు కేసు పెట్టారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. నేను ఆయనకు పార్ట్‌-2’ అని చంపయీ వ్యాఖ్యానించారు.