Sunday, October 6, 2024
HomeUncategorizedబంగారు జ‌డ‌తో ముస్తాబైన ఈషా అంబానీ

బంగారు జ‌డ‌తో ముస్తాబైన ఈషా అంబానీ

Date:

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చెంట్‌ పెళ్లి ఈనెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా అంబానీ ముద్దుల కుమార్తె ఈషా అంబానీ, పెద్ద కోడలు శ్లోకా మెహతా, కాబోయే కోడలు రాధిక మర్చంట్‌ సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా ఈషా అంబానీకి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంత్‌ – రాధిక వివాహానికి ముందు జరిగే ఓ వేడుకలో ఈషా సాంప్రదాయం ఉట్టిపడేలా తయారైంది. గోల్డ్‌ బ్లౌజ్‌, బ్లూ లెహంగా, దుపట్టా ధరించింది. డ్రెస్సింగ్‌ స్టైల్‌కు తగ్గట్టుగానే బంగారు, వజ్రాలతో పొదిగిన ఆభరణాలను ధరించింది. మెడలో హారం, చెవి పోగులు, గాజులతో అందంగా ముస్తాబైంది.

అయితే, ఈషా కేశాలంకరణ మాత్రం ఫ్యాషన్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సౌత్‌ ఇండియన్‌ టచ్‌తో ఈషా తన జడను అలంకరించుకుంది ఈషా. రత్నాలతో కూడిన బంగారు జడను తన జుట్టుకు తగిలించి పైన పూలతో అందంగా అలంకరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సెలబ్రిటీ స్టైలిస్ట్‌ అనైతా ష్రాఫ్‌ అడజానియా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.