Wednesday, October 2, 2024
HomeUncategorizedప్రియురాలితో బ్రేకప్.. పెట్టిన ఖర్చులు అడిగిన ప్రియుడు

ప్రియురాలితో బ్రేకప్.. పెట్టిన ఖర్చులు అడిగిన ప్రియుడు

Date:

బంధాలు, అనుబంధాలు, ప్రేమలు అన్ని ఎక్కడో ఒక దగ్గర ఆర్ధిక బంధాలతోటే పటాపంచలవుతాయి. ఐతే ఒక అబ్బాయి తన ప్రేమ బ్రేకప్ కావడంతో తన ప్రియురాలికి పెట్టిన.. ఖర్చులను లెక్కించుకున్నాడు. దీంతో తన మాజీ ప్రియురాలి నుంచి ఖర్చులు వసూలు చేయాలనీ భావించుకున్నాడు. 

ఆన్ లైన్ లో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక CA కుర్రాడు బ్రేకప్ తర్వాత తన మాజీ ప్రియురాలికి ఖర్చుల గురించి సుదీర్ఘ జాబితాను పంపి డబ్బును తిరిగి ఇవ్వమంటూ డిమాండ్ చేశాడు. ఆ లిస్ట్‌లో ప్రయాణ క్యాబ్ ఖర్చులు, లు చూడటం, కాఫీ తాగడం మొదలైనవి ఉన్నాయి. తమాషా ఏంటంటే అబ్బాయి ఖర్చుల ఎక్సెల్ షీట్ తయారు చేసి అమ్మాయికి పంపించి ఒక్కో నెలకు అయ్యిన ఖర్చులను కూడా చేర్చాడు.

ప్రేమికుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాను ఓ అమ్మాయితో ఏడు నెలలుగా రిలేషన్ షిప్ లో ఉన్నానని.. అప్పుడు మొత్తం సుమారు రూ.లక్ష 2 వేలు ఖర్చు చేశానని చెప్పాడు. ఖర్చులను సగానికి తగ్గించిన ప్రేమికుడు.. తాను పెట్టిన ఖర్చులకు 18 శాతం జీఎస్టీని కూడా జోడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు అతడు ఖర్చుల జాబితాలో క్రాఫ్ కోసం చేసిన డబ్బులు, దోమల కోసం పెట్టిన మార్టిన్ కాయిల్ కూడా ఉన్నాయి.

ఈ ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో trolls_official అనే IDతో షేర్ చేశాడు. ఇది ఇప్పటివరకు సుమారు రెండు లక్షల వ్యూస్ ను డిఫరెంట్ కామెంట్స్ సొంతం చేసుకుంది. ఒకరు అతను సరైన పని చేసాడు.. అందులో తప్పు ఏమిటి’ అని కామెంట్ చేయగా.. మరొకరు మార్టిన్ కాయిల్‌ను కూడా వదలలేదు ఇది కదా అవేర్ నెస్ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.