Friday, September 20, 2024
HomeUncategorizedప్రపంచ వారసత్వ నగరంగా పూరీ...?

ప్రపంచ వారసత్వ నగరంగా పూరీ…?

Date:

దక్షిణాదిన ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడు నగరాన్ని సైతం ప్రపంచ వారసత్వ నగరంగా, రాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంగా మార్చేందుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని నవీన్ వారసుడిగా భావిస్తున్న 5టీ ఛైర్మన్ వీకే పాండియన్ తెలిపారు. తాజాగా రాష్ట్రంలోని తలబానియాలో పర్యటించిన 5టీ ఛైర్మన్ వీకే పాండియన్ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పూరీని రాష్ట్రానికి ఆర్ధిక ఊతంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా కూడా మార్చబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా తమ ప్రభుత్వం మాత్రం ఇది పూర్తయ్యే వరకూ ఆగేది లేదన్నారు.

పూరీలో త్వరలో కొత్త విమానాశ్రయం వస్తుందని, రాజధాని భువనేశ్వర్ కూ, పూరీకి మధ్య ఎనిమిది లైన్ల హైవే కూడా వస్తుందని వీకే పాండియన్ తెలిపారు. మెట్రో రైలును కూడా పూరీ వరకూ పొడిగిస్తామన్నారు. పూరీలో జరుగుతున్న అభివృద్ధిపై విపక్షాల విమర్శలకు స్పందిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. గత 500 ఏళ్లలో పూరీలో జరగని అభివృద్ధని నవీన్ మూడేళ్లలో చేసి చూపించారన్నారు. తాజాగా ప్రభుత్వం పూరీలో ప్రాజెక్టుల కోసం 2 వేల కేట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.