Monday, September 30, 2024
HomeUncategorizedప్రపంచంలో ఇది అత్యంత క్రూరమైన జైలు

ప్రపంచంలో ఇది అత్యంత క్రూరమైన జైలు

Date:

తప్పు చేసిన వారిని తీసుకొచ్చి జైళ్లో వేస్తారు. వారిలో మంచి మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. కాని కొన్ని జైళ్లు అత్యంత దారుణంగా ఉంటాయి. అలాంటి జైళ్లలో ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఒకటిగా నిలుస్తోంది. అక్కడ ఖైదీలు అమానవీయ పరిస్థితులలో జీవిస్తారు, ఊహించలేని హింసకు గురవుతారు. ఇది రష్యాలోని ఒరెన్‌బర్గ్ ఒబ్లాస్ట్‌లోని ఉంది. సాధారణంగా దీనిని బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్ అని కూడా అంటారు.

ఇక్కడ ఖైదీల వృషణాలకు విద్యుత్ షాక్‌లు ఇస్తారని చెబుతారు. సీరియల్ కిల్లర్లు, పిల్లలను లైంగికంగా వేధించేవారు, నరమాంస భక్షకులు వంటి ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులైన నేరస్థులు ఈ రష్యన్ జైలులో ఉంటారు. ప్రస్తుతం ఇందులో 700 క్రిమినల్స్‌ శిక్షను అనుభవిస్తున్నారని సమాచారం. ఈ ప్రదేశం నుంచి బయటపడే ఏకైక మార్గం మరణం మాత్రమేనట. అంటే దీనిలోకి వెళ్లిన ఖైదీ జీవితం అక్కడే అంతమవుతుంది. ఈ జైలు ముఖ ద్వారం ముందు ఓ ఖైదీ తయారు చేసిన ఒక బ్లాక్ డాల్ఫిన్ విగ్రహం ఉంటుంది. దాని కారణంగా ఈ జైలుకి “బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్” పేరు వచ్చింది.

*ఖైదీలకు విద్యుత్ షాక్ ఇస్తారు

ఈ అత్యంత భద్రతా స్థాయి కలిగిన జైలులో 24 గంటలూ ఖైదీలను గమనించేందుకు శిక్షణ పొందిన గార్డ్స్ ఉంటారు. ఖైదీలు క్రూరమైన హింసలను భరించాల్సి వస్తుంది. దీనివల్ల వారి నరాలు చిట్లిపోతాయి. గార్డ్స్ ఖైదీల కాళ్లను దారుణంగా కొడతారు. హింసించేటప్పుడు లేదా విద్యుత్ షాక్స్‌ ఇచ్చేటప్పుడు నేరస్థులను బంధిస్తారు. బలవంతంగా “స్వాలో యోగా పొజిషన్‌”లో ఉండేలా చేస్తారు. ఈ పొజిషన్‌లో ఖైదీ తన కడుపుపై పడుకోవాల్సి ఉంటుంది. అలానే చేతులను వెనుకకు ఎత్తాలి, కాళ్లను పైకి లేపాలి.

బ్లాక్ డాల్ఫిన్ జైలులో 700 మంది ఖైదీలు ఉన్నారని, వీరు అందరూ కలిసి 3,500 మందిని చంపారని, అంటే ఒక్కొక్క ఖైదీ సగటున ఐదుగురిని హత్య చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. వారు చనిపోయే వరకు గదులకే పరిమితమవుతారు. ఇప్పటివరకు ఒక్క ఖైదీ కూడా బ్లాక్ డాల్ఫిన్ జైలు నుంచి తప్పించుకోలేదంటే ఎంత టైట్‌ సెక్యూరిటీ ఉంటుందో ఊహించుకోవచ్చు.

*ఖైదీలకు నరకం చూపిస్తారు

ఈ జైలులో గార్డ్స్ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గస్తీ తిరుగుతారు. ఖైదీలు గదుల నుంచి బయటకు వచ్చినట్లు గమనిస్తే వారికి నరకం చూపిస్తారు. వారిని నడుము వంచమని, చేతులు వెనుకకు పెట్టుకోమని, తుంటిపైకి ఎత్తి నడవమని బలవంతం చేస్తారు. ఖైదీలు పారిపోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతితో ఖైదీకి చుట్టుపక్కల ఏమీ కనిపించకుండా చేసి, పారిపోయేందుకు ప్రణాళికలు వేయకుండా అడ్డుకోవచ్చు.

బ్లాక్ డాల్ఫిన్ జైలులోకి ప్రవేశించిన వెంటనే ఖైదీలకు నియమాలు వివరిస్తారు. ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారి టెస్టికల్స్‌కు ఎలక్ట్రిక్ షాక్స్‌ ఇస్తారు, అరికాళ్లను చితక బాదుతారు. లేదా ప్రమాదకరమైన యోగా భంగిమలు చేయమని బలవంతం చేస్తారు. ఈ జైలులో ఉన్నవారు 1980లు, 1990ల నాటి నేర ముఠాలలో భాగమైన సీరియల్ కిల్లర్లు, ఉగ్రవాదులు అని సమాచారం.