Thursday, October 3, 2024
HomeUncategorizedప్రతిరోజూ 30 నిమిషాలు డ్యాన్స్ చెయ్యండి చాలు

ప్రతిరోజూ 30 నిమిషాలు డ్యాన్స్ చెయ్యండి చాలు

Date:

ప్రస్తుత రోజుల్లో మనిషి శరీరానికి శ్రమ అనేది లేకుండా పోతుంది. సరియైన శారీరక శ్రమ లేకుంటే మనిషికి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ లేని జీవనశైలి మీ బరువును పెంచుతుంది, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని ఎలా ఆరోగ్యంగా ఉండాలి అని చాలామంది ఇంటర్నెట్ లో కూడా వెతుకుతుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ డ్యాన్స్ చేయడం అద్భుతమైన వ్యాయామం. ఇది ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

ముందడుగు ప్రత్యేకం

ఓ నివేదిక ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాలు డ్యాన్స్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చని అనేక పరిశోధనలలో తేలిందట. డ్యాన్స్ అనేది ఒక ప్రయోజనకరమైన వ్యాయామం, ఇది మన శారీరక ఆరోగ్యంతో పాటు మన మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దాదాపు 30 నిమిషాల పాటు డ్యాన్స్ చేయడం వల్ల 130 నుండి 250 కేలరీలు బర్న్ అవుతాయి, దీని కారణంగా శరీరంలోని అదనపు కొవ్వు వేగంగా కరుగుతుంది. క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయడం ఊబకాయంతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో వారికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు

రోజూ డ్యాన్స్ చేయడం ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది శరీరం సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఇది మీరు ఎలాంటి డ్యాన్స్ చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫాస్ట్ మూవింగ్ డ్యాన్స్ అయితే, కొన్ని స్లో డాన్సులు. రెండు పరిస్థితులలో మీ శరీరం, మనస్సు రెండూ పాల్గొంటాయి. డ్యాన్స్ అనేది పూర్తి శరీర వ్యాయామం, ఇది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా మెరుగ్గా చేస్తుంది.

శరీర బలం పెరుగుతుంది

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. డ్యాన్స్ మన శరీరంలోని కండరాలను కదిలిస్తుంది. డ్యాన్స్ చేసేటప్పుడు మీ కాళ్ళను కదిలించడం చాలా ముఖ్యం. ఇది మీ దిగువ శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయడం మీ శరీర బలాన్ని పెంచుతుంది. మధుమేహం లేదా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి డ్యాన్స్ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ డ్యాన్స్ చేయడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.