Saturday, September 28, 2024
HomeUncategorizedప్రజాస్వామ్యం గురించి రాహూల్ గాంధీ మాట్లాడమా

ప్రజాస్వామ్యం గురించి రాహూల్ గాంధీ మాట్లాడమా

Date:

దేశంలో ఎమర్జెన్సీ సమయంలో రాహుల్‌ గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లక్షలాది మందిని జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. అలాంటిది రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లోక్‌తంత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అనే నినాదంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీ చేయడంపై షా అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఏమైందని సేవ్ డెమోక్రసీ అంటున్నారు. రూ.12 లక్షల మేర కుంభకోణాలు చేస్తేనే కదా మీ నాయకులు జైలుకు వెళ్లింది అని ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు కలిసినా మళ్లీ మోడీనే ప్రధానిగా గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆయన తదుపరి పాలనలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందన్నారు. 

లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి బిజెపి 370 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2014లో బిజెపి 55శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిందని, అనంతరం 2019లో 61శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈసారి 70శాతం ఓట్లతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని తెలిపారు. ”మోడీని మూడోసారి ప్రధానిని చేస్తే భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అన్నారు.