Saturday, September 21, 2024
HomeUncategorizedపెంపుడు కుక్క పేరిట నిలువెత్తు బంగారం

పెంపుడు కుక్క పేరిట నిలువెత్తు బంగారం

Date:

పెంపుడు కుక్క ఆరోగ్యం కుదుటపడాలని మొక్కులు మొక్కిన ఓ కుటుంబం ఆ కుక్క పేరిట నిలువెత్తు బంగారం(బంగారంలా భావించే బెల్లం) మేడారం సమ్మక్క సారక్క దేవతలకు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. సంఘటన హనుమకొండలో జరిగింది. బిక్షపతి – జ్యోతి దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క “లియో”కు గత జాతర సమయంలో సుస్తి చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఏమీ తినకుండా అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో వారికి ఏమీ తోచక సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకున్నారు. కుక్క ఆరోగ్యం కుదుటపడితే మళ్ళీ వచ్చే జాతరకు కచ్చితంగా నిలువెత్తు బంగారం సమర్పిస్తామని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కుకున్నారు. మొక్కిన మూడో రోజు నుండే ‘లియో” ఫుల్ యాక్టీవ్ అయిందట. వాళ్ళ మొక్కు ఫలించింది. లియో పూర్తి ఆరోగ్యంతో ఇంట్లో గంతులేస్తుంది. కుటుంబ సభ్యులు అందరితో కలిసి మెలిసి తిరుగుతుంది. దీంతో సమ్మక్క సారక్క దేవతలకు ఆ కుటుంబం మొక్కు తీర్చుకున్నారు.. “లియో”ను తీసుకెళ్లి కాంటాలో కూర్చోబెట్టి నిలువెత్తు బంగారం తులాభారం వేశారు.

ఈ పెంపుడు కుక్క 13 కేజీలు తూగింది.. 13 కేజీల ఎత్తు బంగారం తీసుకెళ్లిన కుటుంబం మేడారం సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు సమర్పించారు.. సమ్మక్క సారక్క దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తామని ఏ మొక్కు మొక్కుకున్నా కచ్చితంగా ఆ మొక్కు నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.