Friday, October 4, 2024
HomeUncategorizedపబ్జీ గేమ్లో పరిచయమైనా యువకుడు

పబ్జీ గేమ్లో పరిచయమైనా యువకుడు

Date:

పబ్జీ గేమ్లో యూపీ ఇటావాకు చెందిన ఓ యువకుడితో అమెరికా అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలిక యువకుడిని కలవడానికి ఇటావా వచ్చింది. అక్కడి నుంచి ఆమె రోడ్డుమార్గం ద్వారా బస్సులో ఢిల్లీకి వెళుతుండగా.. షికోహాబాద్ పోలీసులు బాలికను బస్సు నుంచి దించి విచారించారు. విచారణ అనంతరం బాలికను ఢిల్లీ మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు. పబ్జీ ఆడుతున్నప్పుడు అమెరికన్ అమ్మాయి ఇటావా నివాసి హిమాన్షు అనే అబ్బాయితో స్నేహం చేసింది. దీంతో.. ఆ అమ్మాయి టూరిస్ట్ వీసాపై మొదట చండీగఢ్ చేరుకుంది. అక్కడ నుండి ఇటావాకు వచ్చింది. అమెరికా ఫ్లోరిడాలోని హోమ్స్ క్రీక్ రోడ్ గ్రేస్‌విల్లే నివాసి బ్రూక్లిన్ కార్న్లీ అనే అమ్మాయికి పబ్జీ ఆడటమంటే ఇష్టం. పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు.. చండీగఢ్ నివాసి యువి వాంగో అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో.. అమెరికా అమ్మాయి బ్రూక్లిన్ టూరిస్ట్ వీసాపై ఇండియా వచ్చి మూడు నెలలు చండీగఢ్‌లోని యువీ బాంగో ఫ్లాట్‌లో నివసించింది.

షికోహాబాద్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బాలికకు హిందీ రాదు.. యువకుడికి ఇంగ్లీష్ రాదని తెలిపారు. వారిద్దరూ గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకునేవారని పేర్కొన్నారు. మరోవైపు.. ఇంటెలిజెన్స్, ఎల్ఐయూ కూడా యువకుడిని అర్థరాత్రి వరకు విచారించింది. అనంతరం హిమాన్షును అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. మహిళా కానిస్టేబుల్‌తో పాటు అమెరికా అమ్మాయిని ఢిల్లీకి పంపించారు.