Wednesday, September 25, 2024
HomeUncategorizedపది పాసైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు

పది పాసైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు

Date:

పదవ తరగతి చదివిన వారికి కూడా ఇప్పుడు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. చాలామంది ఆర్థిక పరిస్థితి కారణంగా పదో తరగతి లేదా ఇంటర్ తరువాత చదువుకు స్వస్తి పలుకుతారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఏదో చిన్న చితకా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే పదో తరగతి అర్హతతో కూడా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. దేశ రక్షణ దళాలు, రైల్వేలు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ జాబ్స్‌కు ప్రిపేర్ కావచ్చు. జీతాలు కూడా భారీగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పదో తరగతి అర్హతగా ఉన్న పరీక్షలేంటో పరిశీలిద్దాం.

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్

కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షను నిర్వహిస్తుంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కానిస్టేబుల్ ఎగ్జామ్స్

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్స్ పాత్ర కీలకం. ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు చాలా రాష్ట్రాలు పదో తరగతి అర్హతతో పరీక్షలను నిర్వహిస్తున్నాయి.

పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు

ఇండియా పోస్ట్ పదో తరగతి అర్హతతో వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపడుతుంది. అందులో గ్రామీణ డాక్ సేవక్ (GDS) వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. 10వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ జీడీ

సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి ఏటా రిక్రూట్‌మెంట్ చేపడుతుంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్

ఇండియన్ ఆర్మీ సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్/స్టోర్‌కీపర్ టెక్నికల్ వంటి వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను పదో తరగతి అర్హతతో చేపడుతుంది.

ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ మేట్

ఇండియన్ నేవీ పదో తరగతి అర్హతతో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అందులో ఒకటి ట్రేడ్స్‌మన్ మేట్ రిక్రూట్‌మెంట్. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.18,000 నుంచి 56,900 మధ్య లభిస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్-సి సివిలియన్ పోస్టులు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, కుక్ వంటి వివిధ గ్రూప్ సి సివిలియన్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పదో తరగతి అర్హతతో చేపడుతుంది.

ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి రిక్రూట్‌మెంట్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లలో ట్రాక్ మెయింటెనర్, హెల్పర్/అసిస్టెంట్ వంటి వివిధ పోస్టుల కోసం గ్రూప్-డి పరీక్షలను నిర్వహిస్తుంది.

ఇండియన్ కోస్ట్‌గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ)

ఇండియన్ కోస్ట్‌గార్డ్ పదో తరగతి అర్హతతో నావిక్ జీడీ పోస్టులను భర్తీ చేస్తుంది.