Monday, October 7, 2024
HomeUncategorizedపంట రుణ‌మాఫీ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌

పంట రుణ‌మాఫీ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌

Date:

తెలంగాణ రాష్ట్రంలో పంట‌ల రుణ‌మాఫీకి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రాష్ట్రంలోని ఒక కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమకానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు.

ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్‌ రుణాలకు, రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్‌ పోర్టల్‌ చూడొచ్చు. లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది.