Saturday, September 28, 2024
HomeUncategorizedనేను టికెట్ కలెక్టర్, రైల్వే మంత్రిని కాదు

నేను టికెట్ కలెక్టర్, రైల్వే మంత్రిని కాదు

Date:

ప్రయాణికులు ఎక్కువగా రిజర్వేషన్​ లేకపోయినా చాలా మంది రైలులోనే ప్రయాణిస్తారు. సహజంగా రైళ్లలో రద్దీ ఎక్కువుగా ఉంటుంది. పీక్​సీజన్​ లో అయితే చెప్పే పనే లేదు. ఒక్కోసారి రైలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.. వాష్ రూంకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉండదు. తాజాగా రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తాను పడిన ఇబ్బందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వైరల్​ అవుతున్న వీడియో వివరాల ప్రకారం 22969 OKHA BSBS SF EXP (ఓఖా నుండి కాన్పూర్ సెంట్రల్) రైలులో ఓ యువతి ప్రయాణిస్తున్న కోచ్​ బాగా రద్దీగా ఉందని.. అందులో మహిళలు ఎవరూ లేరని .. అందరూ అబ్బాయిలే ఉన్నారని.. తాను ప్రయాణం చేయడం చాలా కష్టంగా.. అసౌకర్యంగా ఉందని .. తన కోచ్​ మార్చాలంటూ టీటీఈని అభ్యర్థించింది. అయితే టీటీఈ మాత్రం తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా.. ఆ యువతి వ్యంగ్యంగా సమాధానం చెప్పాడని పేర్కొంది. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను.. నేను రైల్వే మంత్రిని కాదు.. అదనపు రైళ్లను నడపలేను.. అంటూ ఆ యువతికి సమాధానం ఇచ్చాడు. టీటీఈ ఇచ్చిన సమాధానికి ఆ మహిళ స్పందిస్తూ.. రైల్వే అధికారులు వారి భద్రత గురించే ఆందోళనలో ఉన్నారని… మహిళా ప్రయాణికుల భద్రత గురించి ఏం పట్టించుకుంటారని సమాధానం ఇచ్చింది.