Monday, September 23, 2024
HomeUncategorizedనిమిషానికి గూగుల్ ఆదాయం రూ.2 కోట్లు

నిమిషానికి గూగుల్ ఆదాయం రూ.2 కోట్లు

Date:

ఇప్పుడు మ‌నిషి ప్ర‌తి విష‌యానికి గూగుల్‌పై ఆధార‌ప‌డుతున్నాడు. మ‌నిషిని త‌న‌పై పూర్తిగా ఆధార‌ప‌డేలా గూగుల్ చేసుకుంది. గూగుల్ నుంచి సెర్చింజన్‌తో పాటు మ్యాప్స్ ఉన్నాయి.. యూట్యూబ్ ఉంది.. ఇలా ఏది అందిస్తున్నా అంతా ఉచితమే. ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రీమియం సేవలు పొందాలంటే డబ్బులు చెల్లించాలి. ఇలా ఆ కంపెనీ ఆదాయం భారీగా ఉంటుంది. అన్ని సేవలు ఉచితంగానే ఇస్తున్నప్పటికీ భారీగా డబ్బును సంపాదించడం ఎలా సాధ్యపడుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కంపెనీ ఏ ప్రాజెక్టు చేపట్టినా అది భారీ విజయం సాధించడమే కాదు.. లక్షల కోట్లరూపాయల ఆదాయాన్ని తెచ్చుకుంటోంది.

కోట్ల లింకులతో రూ.కోట్ల ఆదాయం

గూగుల్‌కు ఆదాయం వాణిజ్య ప్రకటనల ద్వారా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అనేక రకాల విషయాలను తెలుసుకోవడానికి గూగుల్‌లో శోధిస్తుంటారు. గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అక్కడ రెండు లింక్స్ వస్తాయి. వాటి నుంచి మరో మూడు లింకులు ఇతర లింకులకు వస్తాయి. ఇలా ప్రజలు గూగుల్‌లో ఎన్నిసార్లు సెర్చ్ చేస్తే అన్ని కోట్లసార్లు ఆదాయం వస్తుంది. వీటికి తోడు యూట్యూబ్‌లో కోట్లరూపాయల ఆదాయం కోట్ల సంఖ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా వస్తుంది.

ప్లేస్టోర్ నుంచి భారీ ఆదాయం

గూగుల్ ఒక దశ వరకు అన్ని సేవలు ఉచితంగా అందిస్తుంటుంది. పరిమితి దాటిని తర్వాత సేవలను పొందాలనుకుంటే మనం తిరిగి డబ్బులు చెల్లించాలి. మనకు ఉండే జీమెయిల్ ఖాతాల్లో 15జీబీ డేటా ఉచితంగా ఇస్తుంది. అంతకుమించి కావాలంటే డబ్బులు చెల్లించాలి. అలా ఆదాయం వస్తుంటుంది. మొబైల్ కంపెనీలు తాము తయారుచేసే ఫోన్లలో గూగుల్ యాప్స్‌ను ఇన్ బిల్ట్, డీఫాల్ట్‌గా ఉంచేందుకు ఈ కంపెనీలన్నీ గూగుల్ కు డబ్బులు చెల్లిస్తాయి. అలా యాప్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్ ఉపయోగించాలన్నా కంపెనీలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ యాప్స్ అన్నీ ఒకేచోట పొందేందుకు గూగుల్ ప్లేస్టోర్ ఉంది. ఇందులో కోట్ల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. వీటిద్వారా కూడా గూగుల్ కంపెనీ భారీగా లాభాలను ఆర్జిస్తోంది. ఒక నివేదిక ప్రకారం గూగుల్ కంపెనీ నిముషానికి రూ.2 కోట్లు సంపాదిస్తోంది.