తెలుగు రాష్ట్రాలలో గత పధ్నాలుగు సంవత్సరాలుగా సమాజంలో అవినీతి రహిత సమాజంగా పనిచేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రభుత్వ శాఖలలో పనిచేసిన, పనిచేస్తున్న నిజాయితీ అధికారుల ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అదివారం హైదరాబాద్ బేగంపేట హరితప్లాజాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి అధ్యక్షత వహించగా సిబిఐ మాజీ జెడి లక్ష్మినారాయణ, మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, చంచల్ గూడ జైలు సూపరిండెంటెంట్ శివకుమార్, మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింహులు హజరయ్యారు.
మాజీ సిబిఐ జెడీ లక్ష్మినారాయణ ప్రసంగం
వాళ్ల అమ్మనాన్నలు, గురువుల సత్కారం. రాజకీయాలు బాగుపడితే సమాజం బాగుపడుతోంది. ఎన్నికల సంస్కరణ, రాజకీయ సంస్కరణలు తీసుకురావాలి. అప్పుడే అవినీతి నిర్మూలించవచ్చు. రాజకీయ ప్రక్షాళన కావాలి, ప్రజల ఆలోచన విధానం మార్చాలి. అధికారి ప్రవర్తన ఏలా ఉందో ప్రజలు చెప్పాలి. టెక్నాలజీని ఉపయోగించి బయటికి రావాలి. ప్రజా ఉద్యమాలను తీసుకొచ్చే వ్యక్తులు తగ్గిపోతున్నారు. ఉద్యోగుల ఎంపికలో రాజకీయ పైరవీలకు తావివ్వకుండా పారదర్శకంగా జరగాలి. నిజాయితీ అధికారులు మీ మీ పరిధిలో గొప్ప ప్రయత్నం చేశారు. నిజాయితీ అధికారుల సంతతి పెరగాలి. నిజాయితీ అనేది స్కూల్, ఇల్లు, దేవాలయంలో పెరగాలి.
ఆకునూరి మురళి ప్రసంగం
సమాజంలో అవినీతి జరుగుతుందని ప్రతి ఒక్కరి అంటుంటారు. కాని కళ్లముందు జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ముందుగా కనబడిన అవినీతిని ప్రశ్నించండి. మంచిగా పనిచేస్తే రివార్డు ఇవ్వండి, తప్పు చేస్తే శిక్షించండి. ప్రభుత్వాలు ప్రతి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనకు తెలిసిన సమాచారం చెప్పడానికి వెనకడుగు వేద్దాం. మనకెందుకులే అనుకుంటారు. ఆ ఆలోచన మానుకొండి. ఇప్పుడు దేశాన్ని మార్చడానికి 60సంవత్సరాలు యువకులు ముందుకు రావాలన్నారు. సమాజంలో మార్పు వచ్చే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా చేయాలన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
ఆర్పీ పట్నాయక్. సంగీత దర్శకుడు..
గతంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ నిజాయితీ పరులు ఉన్నారో వెతకడం కూడా చాలా కష్టమైన పని, ఎందుకంటే చాలా మంది తప్పులు చేస్తూనే, నిజాయితీగా ఉన్నట్టు నటిస్తారు. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులలో చాలా మంది అవార్డు తీసుకుంటారు, కొన్ని రోజులకే లంచం తీసుకుంటే పట్టుబడిన సంధర్బాలు ఉన్నాయి.. మీ అందరిని వెతకడం కోసం మా సంస్థ పెద్ద ప్రయోగమే చేసినట్లు తెలుస్తోంది.. ఇప్పటి సమాజంలో నిజాయితీగా గుర్తింపు తగ్గిపోతుంది. ఆ గుర్తింపు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఇవ్వడం చాలా గర్వకారణం.. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సాగుతూ ఉండాలి..
శివకుమార్. చంచల్‌గూడ జైలు సూపరిండెంటెంట్..
నిజాయితీ పరులు ఆత్మీయ సత్కారం మంచి కార్యక్రమం. మంచి సమాజం ఏర్పడాలంటే మంచి వ్యక్తులు కావాలి.. మంచి వ్యక్తులకు గుర్తింపు ఉండాలి.. ఆ గుర్తింపు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్ధ ఇస్తోంది. సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆలోచించే విధంగా, వినూత్నంగా ఉన్నాయి.. సత్కారం పొందిన అధికారులందరిని నా ధన్యవాదాలు..
రాజేంద్ర పల్నాటి. పౌండర్. యూత్ ఫర్ యాంటీ కరప్షన్..
సమాజంలో ఒక మంచి మార్పు కోసం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఎప్పుడు ముందే ఉంటుంది. గతంలో నిజాయితీగా పనిచేసిన రాజకీయనాయకులను, నిజాయితీగా గ్రామ అభివృద్దికి కోసం పనిచేసిన సర్పంచులను సత్కరించాం. నిజాయితీకి గుర్తింపు ఇచ్చినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఆలోచనతో సంస్థ ముందుకు నడుస్తోంది.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత మూడు, నాలుగు నెలల నుంచి నీతిగా, నిజాయితీగా పనిచేసిన అధికారుల వివరాలను సేకరించాం వారిని ఆత్మీయ సత్కారం పేరుతో సన్మానించాం. అధికారులుగా పనిచేసిన వారు, ఇప్పటికి పనిచేస్తున్నవారిని మొత్తం 16మందిని ఎంపిక చేశామన్నారు. నిజాయితీ అధికారులు, నాయకులు, సర్పంచుల కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతోంది..
16మంది నిజాయితీ అధికారులకు సత్కారం..
తెలంగాణ అగ్రికల్చర్ మాజీ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, జస్వంత్ కుమార్ అర్ అండ్ బి చీఫ్, ఎ. నాగేంద్ర రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, డా. రామకిషన్ సూపరిండెంట్ జనరల్ ఆసుపత్రి మహబూబ్ నగర్, బుట్ల కరుణ అగ్రికల్చర్ ఏఓ, అమ్రేష్ కుమార్ రిటైర్ట్ ఏడీఏ, వై. శ్రీనివాస్ రావు, రిటైర్డ్ అసిస్టెంట్ సర్జన్ వెటర్నరీ డిపార్ట్ మెంట్, అశోక్ ఎడీఈ ఎలక్ట్రిసిటీ, జివిఎస్ ప్రసాద్ సెక్షన్ ఆఫీసర్ వినియోగదారుల పోరం సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ దన్నపునేని అశోక్‌కుమార్, డా. స్రవంతి, డా. స్నిగ్ధ, గీతానందు, మీడియా కార్యదర్శి జయరాం, కొమటి రమేష్ బాబు, కొన్నె దేవేందర్, జి. హరిప్రకాశ్, వరికుప్పల గంగాధర్, బత్తిని రాజేశ్, చింతల రమేశ్, ఎం. విక్రమ్, సిహెచ్ ప్రేమ్, కొక్కుల ప్రశాంత్, సూర రాజేందర్, నాగేంద్ర, నియామత్ బాషా, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.