Wednesday, January 15, 2025
HomeUncategorizedనర్సంపేట ఉప్పలయ్య హోటల్‌కు అవార్డు

నర్సంపేట ఉప్పలయ్య హోటల్‌కు అవార్డు

Date:

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా నర్సంపేట నడిబొడ్డున ఉప్పలయ్య అనే వ్యక్తి 30 ఏండ్ల నుంచి నడిపించిన హోటల్‌కు ఇప్పుడు భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది. అక్కడ దొరికేది రుచికరమైన, నాణ్యమైన ఇంటి భోజనం. తక్కువ ధరలకే లాభాపేక్ష లేకుండా అందిస్తున్నారు. ఇల్లే హోటల్‌గా నడిపిస్తున్నారు. ఈ హోటల్‌కు భారత ప్రభుత్వం (మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌) నుంచి రీజినల్‌ హెడ్‌ ఆఫీసు హైదరాబాద్‌ ద్వారా అవార్డు వచ్చింది.

సభ్యులు రెండు నెలల కిందట ఈ హోటల్‌లో భోజనం చేసి బాగుందని చెప్పి వెళ్లారు. సోమవారం వారు మళ్లీ వచ్చి హోటల్‌లో ఇదే నాణ్యత కొనసాగించాలంటూ అవార్డును అందించారు. ఉప్పలయ్య మరణానంతరం అదే హోటల్‌ను ఆయన కుమారుడు శ్రీనివాస్‌ నడిపిస్తున్నారు. హోటల్‌లో కుటుంబ సభ్యులు మొత్తం వర్కర్లుగా ఉండి సొంతంగా వంటలు చేస్తారు. ఇక్కడ రోజూ 150 నుంచి 200 మంది భోజనం చేస్తున్నారు. సాదా భోజనానికి రూ.90 తీసుకుంటున్నారు. వెజ్‌, నాన్‌వెజ్‌ కూడా ఉంటుంది.