Thursday, October 3, 2024
HomeUncategorizedదేశ చరిత్రలోనే అమిత్ షా భారీ మెజార్టీ

దేశ చరిత్రలోనే అమిత్ షా భారీ మెజార్టీ

Date:

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు మెజార్టీని ఎన్డీయే కూటమి దాటేసింది. 294 స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ రమణ్‌భాయ్‌పై 7,44,716 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో అమిత్‌ షాకు 10,10,972ఓట్లు రాగా, రమణ్‌భాయ్‌కి 266256 ఓట్లు పోలయ్యాయి. ఇక బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మహమ్మద్‌ అనీశ్‌ దేశాయ్‌కి డిపాజిట్‌ దక్కలేదు.

బీజేపీకి సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 లోక్ స సీట్లు వచ్చే అవకాశం లేనట్లు సృష్టంగా కనబడుతోంది. బీజేపీ నేతృతంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనబడుతున్నప్పటికీ.. బీజేపీకి గత రెండు లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగా సొంతంగా 272 పైనే సీట్లు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. బీజేపీ సొంతంగా 240 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ.. ఎన్డీయే కూటమిలో ముఖ్య పార్టీలు అయిన తెలుగుదేశం, జేడీయూలపై ఆధారాపడాల్సి ఉంటుంది. జేడీయూ కంటే టీడీపీకే ఎక్కువ లోక్ సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో కేంద్రంలో మరోసారి చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం కనబడుతోంది.