Thursday, October 3, 2024
HomeUncategorizedదేశంలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు

దేశంలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు

Date:

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మించనుంది. ప్రధాని మోడీ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు తొలి నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణాల్లో మరో మూడు కోట్ల గృహాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ‘అర్హత ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గృహ అవసరాలను తీర్చడానికి గ్రామీణ, పట్టణ కుటుంబాలకు మూడు కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం కోసం సహాయం అందించాలని సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు’ అని అధికారులు తెలిపారు.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2015-16 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన గ్రామీణ, పట్టణ ప్రజలకు గృహాల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. గత పదేళ్లలో ఈ పథకం కింద పేద కుటుంబాల కోసం 4.21 కోట్ల గృహాలను నిర్మించారు.