Thursday, October 3, 2024
HomeUncategorizedతెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

Date:

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయం గేటు నుండి లోపలికి వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఇకనుంచి పశ్చిమ దిశగా ఉన్న గేటు నుంచి లోనికి వెళ్లనుంది. ఇక బయటకు తూర్పు దిశగా ఉన్న గేటు నుంచి వెళ్లాలని వాస్తు మార్పులు చేసినట్టు సమాచారం.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి సచివాలయంలో వాస్తుకు సంబంధించి మార్పులు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది.

అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గత తెలంగాణా సీఎం కేసీఆర్ తనకు కలిసొచ్చిన సంఖ్య అయిన ఆరుతో ఆరవ అంతస్తులో ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆరవ అంతస్తు నుండి తొమ్మిదవ అంతస్తుకు సీఎం కార్యాలయాన్ని మార్పు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తొమ్మిదవ అంతస్తులో సీఎం కార్యాలయ ఏర్పాటు పనులు కొనసాగిస్తున్నారు. సౌత్ ఈస్ట్ గేటు ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ తో పాటు ఉన్నతాధికారులు రాకపోకలు సాగించనున్నారు. సెక్రటేరియట్ లోపల మార్పులు చేర్పులు చేయిస్తున్న ప్రభుత్వం ఎందుకు కౌంటింగ్ సమయంలో మార్పులు చేయిస్తుంది అన్నది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాంధీభవన్లోను రేవంత్ రెడ్డి కొన్ని వాస్తు మార్పులు చేశారు.