Thursday, October 3, 2024
HomeUncategorizedతెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తాం

తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తాం

Date:

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఈ వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. 

”తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంగనర్‌ సభలో హామీ ఇచ్చాం. గడచిన పదేళ్లుగా ప్రజలు మా పార్టీ పట్ల అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా మా పార్టీ పనిచేస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం” అని సోనియా గాంధీ తెలిపారు.