Wednesday, October 2, 2024
HomeUncategorizedతెలంగాణ రాష్ట్రంలోకి కొత్త బీర్లు

తెలంగాణ రాష్ట్రంలోకి కొత్త బీర్లు

Date:

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో బీర్లను అందుబాటులో ఉంచాలని పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసిన వార్తలను కూడా చేశాం. అయినా కూడా బీర్లు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలోకి కొత్త బీర్లు రాబోతున్నారు. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్‌లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందింది. ఇక పవర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణలో రూ. 5000 కోట్ల లిక్కర్ స్కాం జరిగినట్లు వార్తలు వచ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర జరుగుతున్నట్లు పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశ ఉందని రాసుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కొరత సృష్టించారు. ఇది సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు, వాటి ద్వారా భారీగా కమీషన్ పొందేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు సమాచారం.