Monday, December 23, 2024
HomeUncategorizedతెలంగాణ ఉత్సవాల దశాబ్ది ఖర్చు.. అక్షరాలా 105 కోట్లు..

తెలంగాణ ఉత్సవాల దశాబ్ది ఖర్చు.. అక్షరాలా 105 కోట్లు..

Date:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సంధర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21రోజులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అందుకు భారీగానే నిధులు ఖర్చు పెట్టారని ప్రచారం ఉంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలు, ఖర్చుల వివరాలను తెలుసుకునేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆర్టీఐ దరఖాస్తుకు ప్రణాళికా శాఖ సంయుక్త సంచాలకులు కె. రవిందర్ జిల్లాల వారీగా కేటాయించిన నిధుల వివరాలను అందజేసారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ప్రణాళికా శాఖ ద్వారా విడుదల చేసిన మొత్తం 105 కోట్లు అని తెలిపారు. 

జిల్లాల వారీగా కేటాయింపులు

ఆదిలాబాద్ – 338 లక్షలు

కొమ్రభీం – 254 లక్షలు

మంచిర్యాల – 270 లక్షలు

నిర్మల్ – 314 లక్షలు

ఖమ్మం – 481 లక్షలు

భద్రాద్రి కొత్తగూడెం – 368 లక్షలు

కరీంనగర్ – 312 లక్షలు

జగిత్యాల – 307 లక్షలు

పెద్దపల్లి – 240లక్షలు

రాజన్న సిరిసిల్ల – 216 లక్షలు

హన్మకొండ – 195 లక్షలు

వరంగల్ – 260 లక్షలు

జనగాం – 245 లక్షలు

భూపాలపల్లి – 170 లక్షలు

ములుగు – 127 లక్షలు

మహబూబాద్ – 322 లక్షలు

మహబూబ్ నగర్ – 337 లక్షలు

నారాయణపేట – 256 లక్షలు

గద్వాల్ – 282 లక్షలు

నాగర్ కర్నూల్ – 446 లక్షలు

వనపర్తి – 230 లక్షలు

నిజామాబాద్ – 435 లక్షలు

కామారెడ్డి – 408 లక్షలు

రంగారెడ్డి – 502 లక్షలు

మేడ్చల్ – 186 లక్షలు

వికారాబాద్ – 418 లక్షలు

మెదక్ – 316 లక్షలు

సంగారెడ్డి – 506 లక్షలు

సిద్దిపేట – 442 లక్షలు

సూర్యాపేట – 372 లక్షలు

భువనగిరి – 328 లక్షలు 

హైదరాబాద్ జిల్లా ఖర్చుల సమాచారం మాత్రం ఇవ్వలేదు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 617 లక్షలు ఖర్చు పెట్టగా, అతి తక్కువ ఖర్చు ములుగు జిల్లాలో 127 లక్షలు మాత్రమే పెట్టారని ప్రభుత్వం ఇచ్చిన సమాచారం హక్కు చట్టం సమాచారంలో ఉంది.