Sunday, September 22, 2024
HomeUncategorizedతెలంగాణలో మెగా కారు టెస్టింగ్‌ సెంటర్‌

తెలంగాణలో మెగా కారు టెస్టింగ్‌ సెంటర్‌

Date:

తెలంగాణ మెగా కారు టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సహా అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సదుపాయం ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేందాన్ని విస్తరించాలని హ్యుందాయ్ తెలిపింది. భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ ప్రతినిధులు సీఎం రేవంత్‌ బృందానికి తెలిపారు.

హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హెచ్ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని తెలిపారు.పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రస్తుతం కొరియాకు చేరుకొని అక్కడ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.