Saturday, September 21, 2024
HomeUncategorizedతల్లి అంత్యక్రియలకు కూతురు బిక్షాటన

తల్లి అంత్యక్రియలకు కూతురు బిక్షాటన

Date:

నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడ గ్రామంలో గుండెలు పిండే విషాదం జరిగింది. తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని విగత జీవిగా చూసిన ఆ కూతురుకి ఏం చేయాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. స్థానికులకు ఈ వార్త తెలియడంతో మృత దేహాన్ని కిందికి దించారు. అయితే పూట గడవడమే కష్టంగా మారిని ఆ కుటుంబానికి అంత్యక్రియలకు కాసులు కరువయ్యాయి. ఆ కూతురు తల్లి మృతదేహం వద్ద ఎవరైనా సహాచం చేస్తారేమో అంటూ దీనంగా చూసింది. కానీ.. ఎవరూ తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వకపోవడంతో చివరకు తల్లికోసం కూతురు భిక్షాటన చేసింది. ఇంటి ముందు ఓ దుప్పటిని పరిచి అంత్యక్రియలకు సహాయం చేయాలను కోరుకుంటూ దీనస్థితిలో కూర్చున్న ఆ బాలికను చూసి.. అక్కడున్న వారందరికి కన్నీరు తెప్పించింది.

 చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయిన ఆ బాలికకు అన్నీ తానే అయి చూసుకుంటున్న తల్లి కూడా దూరమవడంతో బాలిక ఒంటరిగా మారింది. తల్లి అంత్యక్రియలకు భిక్షాటన చేస్తున్న ఆ బాలికను గ్రామ ప్రజలు కూడా పట్టించుకోక పోవడంతో దీన స్థితిలో ఉండిపోయింది. తన తల్లి అంత్యక్రియలకు సహాయం చేయాలని కోరుతుంది. దాతలు ఎవరైనా తన తల్లి అంత్యక్రియలకు డబ్బు ఇవ్వాలని చేతులెత్తి మొక్కుతూ కన్నీరు కార్చుతుంది.